విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాన్ నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు,నాయకులతో హోంమంత్రి వంగలపూడి అనిత టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావంతో చెట్లు కూలిన చోట్ల వెంటనే ప్రొక్లెయిన్లు, క్రేన్ల సాయంతో తొలగించాలన్నారు.
అలాగే నియోజకవర్గంలో NDRF బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. బంగారమ్మపాలెం, సోమిదేవిపల్లి, రాజయ్యపేట గ్రామాల్లో తక్షణ చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలన్నారు.
ఈ క్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా, అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
Check Also
అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …
Prajavartha Online Telugu News