Breaking News

నవంబర్ 7 శుక్రవారం రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశం

-కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 7వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు, కలెక్టర్ కార్యాలయం ధవళేశ్వరంలోని PGRS హాల్‌లో రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశం జరుగనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్ మరియు లైఫ్ అసోసియేట్ సభ్యులు అందరికీ తెలియజేయున దేమనగా, ఈ సమావేశంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, తూర్పు గోదావరి జిల్లా శాఖకు నూతన మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా యూనిట్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ జిల్లా శాఖకు నూతన మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల ఎంపిక జరగనున్నందున, జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన అందరూ తప్పనిసరిగా హాజరు కావలసిందిగా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *