Breaking News

పీఎంఏవై 2.0 సర్వే వేగవంతం – నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలి : కలెక్టర్ కీర్తి చేకూరి

-ఇప్పటి వరకు 1442 గృహాల సర్వే పూర్తి చేశాం
-శనివారం గోకవరం మండలంలో క్షేత్ర స్థాయిలో సర్వే ప్రక్రియ పరిశీలనా
-హౌసింగ్ పిడి నాతి బుజ్జి

రాజమహేంద్రవరం / గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి స్వంత ఇల్లు సాకారం అయ్యేలా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలనీ, అధికారులు పర్యవేక్షణ లో సర్వేను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.

తూర్పు గోదావరి జిల్లాలో పీఎంఏవై 2.0 (ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ) కింద గృహాల సర్వే పనులు మళ్లీ వేగంగా కొనసాగుతున్నాయనీ, ఆవాస్ ప్లస్ యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు పరిష్కారమవడంతో సర్వే తిరిగి ప్రారంభమైందని జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. బుజ్జి శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. శనివారం గోకవరం మండలంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి, సర్వే పనులును హౌసింగ్ పిడి పరిశీలన చేయడం జరిగింది.

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు నవంబర్ 30వ తేదీ నాటికి సర్వేను పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్ర స్థాయిలో సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన గృహరహిత కుటుంబాల వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు.

తూర్పు గోదావరిలో ఇప్పటివరకు మొత్తం 15,533 దరఖాస్తులు స్వీకరించగా, అందులో 657 సర్వేలు పూర్తయ్యాయి, మిగిలిన 14,876 సర్వేలు కొనసాగుతున్నాయి. వీటిలో 1,442 గృహాల సర్వే పూర్తి అయిందని, , 14,091 దరఖాస్తులకు చెందిన సర్వే జరుగుతోందనీ నాతి బుజ్జి తెలిపారు.

సర్వే ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. అర్హులైన ప్రతి కుటుంబం పేరు జాబితాలో చేర్చేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తున్నారని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బుజ్జి తెలిపారు.

మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి –
అనపర్తి (225 దరఖాస్తులు, 22 సర్వే పూర్తయినవి), బిక్కవోలు (345, 20), చాగల్లు (320, 41), దేవరపల్లె (1,278, 20), గోకవరం (798, 8), గోపాలపురం (1,521, 8), కడియం (575, 6), కోరుకొండ (1,408, 1), కొవ్వూరు (299, 49), నల్లజర్ల (2,981, 15), నిడదవోలే (641, 42), పెరవలి (666, 188), రాజమహేంద్రవరం (గ్రామీణ) (585, 76), రాజానగరం (1,798, 66), రంగంపేట (595, 22), సీతానగరం (761, 12), తాళ్లపూడి (435, 46), ఉండ్రాజవరం (302, 15).

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *