– మెప్మా పిడి టి. కనక రాజు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మెప్మా (MEPMA) మరియు నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నవంబర్ 9, 2025 ఆదివారం రోజున రాజమండ్రి సుబ్రమణ్య మైదానం లో నిర్వహించ నున్నట్లు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనక రాజు శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రిటైల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, హాస్పిటాలిటీ, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్ వంటి విభిన్న రంగాలకు చెందిన 15 కంటే ఎక్కువ ప్రఖ్యాత కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొననున్నాయి. ఈ మేళా నిరుద్యోగ యువతకు, ఉద్యోగార్ధులకు అనుకూలమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
అర్హతలు: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మా, నర్సింగ్ మొదలైన విద్యార్హతలు కలిగిన వారు పాల్గొనవచ్చు.
అందరు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా తూర్పు గోదావరి జిల్లా వారు విజ్ఞప్తి చేశారు.
తేదీ: నవంబర్ 9, 2025 (ఆదివారం)
స్థలం: సుబ్రమణ్య మైదానం, మునిసిపల్ ఆఫీస్ ఎదురుగా, రాజమండ్రి
ఉదయం 9 గంటల నుంచి
Prajavartha Online Telugu News