రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎన్ఎస్కేఎఫ్ఎసీ (NSKFDC) పథకంలో భాగంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు శ్రీమతి జె. సత్యవతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం, ప్రగతి భవన్, జనరల్ ఆసుపత్రి ఎదురుగా, కాకినాడ అనే చిరునామాకు పోస్టులో లేదా వ్యక్తిగతంగా సమర్పించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్: 62818-17023 నంబరును సంప్రదించాలని సూచించారు.
అర్హతలు:
* ఆసక్తి గల అభ్యర్థులు ఐదుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడవలెను.
* ప్రతి సభ్యుడు సఫాయి కర్మచారి సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
* గ్రూపులో కనీసం ఒకరికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
* గ్రూపు ప్రధాన సభ్యుడు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీలు సమర్పించాలి.
5. పథకం కింద సబ్సిడీ మినహా మిగిలిన రుణాన్ని 6% వడ్డీతో 72 నెలసరి వాయిదాల్లో (ప్రతి నెల రూ.33,064/-) చొప్పున క్రమంగా చెల్లించవలెను.
Prajavartha Online Telugu News