విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, సామ వేదపండితులు కె.నరసింహ మూర్తి ఆదివారం కలిశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీకు అందచేశారు. అక్టోబర్ 07 నుంచి 15 వరకు ఆలయంలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా కోరారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ కి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …