విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి ప్రమాణ స్వీకారం కార్యక్రమమునకు సంబందించి చేపట్టిన ఏర్పాట్లు మరియు ఆధునీకరణ పనులు నగరపాలక సంస్థ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ సోమవారం అధికారులతో కలసి క్షేత్రస్తాయిలో పరిశీలించారు. కళాక్షేత్రం నందు ప్రమాణ స్వీకార మహోత్సవమునకు వచ్చు ముఖ్యఅతిధులు మరియు ఇతర ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా కళాక్షేత్రం నందు జరుగుతున్న పనుల యొక్క పురోగతిని పర్యవేక్షించి చేపటిన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కళాక్షేత్రo ఆవరణలో గల హై టి ప్రదేశములోని గ్రీనరి మరియు పరిసరాలు ప్రాంతాలను పరిశీలిస్తూ, పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంబందిత అధికారులకు సూచించారు. దసరా ఉత్సవాలకు సంబంధించి రేపటి నుండి అధిక మొత్తంలో భక్తులు వచ్చుటకు అవకాశం ఉన్నందున అధికారులకు దిశనిర్దేశాలు ఇస్తూ, అధికారులు అందరు వారికీ కేటాయించిన ప్రదేశాలలో నిరంతర పర్యవేక్షణలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. విధినిర్వహణలో ప్రతి ఒక్కరు విధిగా కోవిడ్ నిభందనలు పాటించేలా చూడాలని అన్నారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, ఎ.డి.హెచ్ జె.జ్యోతి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …