-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా, ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఆర్ బి ఐ ద్వారా రూపొందించిన పోస్టర్లను ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ , ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలంటే ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలలో జాగ్రత్తలు, పొదుపు అలవాట్లు అలవర్చు కోవడంతో పాటు ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా రూపొందించిన అవగాహన వారోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ లావాదేవీల భద్రత వంటి అంశాలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్, ఆర్‌ఎంసీ కమిషనర్ రాహుల్ మీనా, డీఆర్ఓ టి..సీతారాం మూర్తి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News