Breaking News

మహాశివరాత్రి సందర్భంగా తదుపరి రోజున ఫిబ్రవరి 16న ఐచ్చిక సెలవు

-పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ రద్దు
-1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలు స్వీకరణ
–కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తదుపరి రోజూ (16వ తేదీ, సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఫిబ్రవరి 16 వ తేదీన రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలు తమ ఫిర్యాదులు అందజేయడానికి సంబంధిత కార్యాలయాలకు రావద్దని అర్జీదారులను కోరారు. తదుపరి సోమవారం నుండి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు సేవలను విస్తృతంగా వినియోగించు కోవాలని సూచించారు. ఫిర్యాదులను 1100 ద్వారా నమోదు చేసుకోవచ్చని, అదే విధంగా ఆయా అర్జీల పరిష్కార స్థితిని తెలుసుకునే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009 కు ఫోన్ చేసి సత్వర పౌర సేవలు పొందవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *