Breaking News

ఫిబ్రవరి 17న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా

-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
-జిల్లా ఉపాధి అధికారి కే హరీష్ చంద్ర ప్రసాద్.
-జిల్లా నైపుణ్యాధికారి విడిజీ మురళి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఫిబ్రవరి 17వ తేదీ (మంగళవారం) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలొ ఠాగూర్ లాబ్స్, ఎస్ బి ఐ ప్రెమెంట్స్, పేటియం మరియు ఇన్నోవా సోర్స్ కంపెనీలోని పలురకాల పోస్టల భర్తీకొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడనున్నాయని ఆయన తెలిపారు. 10, ఐ టీ ఐ, డిప్లొమా, నుండి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన, అనుభవం ఉన్న లేదా ఆశక్తి గల 19 నుండి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థుల తమ రెజ్యూమే, ఆధార్ మరియు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సిద్ధంగా మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్, జిల్లా నైపుణ్యాదికారి వి డి జీ మురళి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *