Breaking News

ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్ రెంటపల్లి శ్యామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన టిఎన్‌టియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్ మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాద పూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీ కేశినేని శివనాథ్‌ను కలిసి తన నియామకంకు అన్ని విధాలుగా సహకరించినందుకు ఎంపీ శివనాధ్(చిన్ని)కు రెంటపల్లి శ్యామ్ ధన్యవాదాలు తెలిపారు. శ్యామ్‌ను ఎంపీ శివనాధ్ అభినందించారు. పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలని సూచించారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు టిడిపి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్(చిన్ని) అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ , టిఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, టీఎన్‌టియూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ మొకర ఆదిబాబు, విజయవాడ (గొల్లపూడి) మార్కెట్ యార్డు కమిటీ ఉపాధ్యక్షులు పాల మాధవ, టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లగూర చరణ్ యాదవ్, తూర్పు నియోజకవర్గ టిఎన్‌టీయూసీ అధ్యక్షులు రాయవరపు అశోక్, టిడిపి ఎస్‌సి సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు కామా నరసింహారావు, టిఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి కూచిపూడి దిలీప్‌కుమార్, టిఎన్‌టీయూసీ నాయకులు కామా వెంకట నరసింహారావు, రెంటపల్లి నవీన్, గడ్డాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *