రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం పట్టణంలో జరిగిన పాలు కల్తీ ఘటనకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో KIMS Hospital లో చికిత్స పొందుతున్న జి. సూర్యారావు (వయస్సు: 81 సంవత్సరాలు) మంగళవారం దురదృష్టవశాత్తు మరణించినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె వెంకటేశ్వర రావు తెలియజేశారు. మృతుని కుటుంబ సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 13 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన రోగుల ఆరోగ్య పరిస్థితి నిరంతరం పర్యవేక్షణలో ఉండగా, అవసరమైన అన్ని వైద్య చర్యలు కొనసాగు తున్నాయన్నారు.
ఆసుపత్రుల వారీగా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
KIMS Hospital – 6 మంది, Delta Hospital – 3 మంది, Rainbow Children’s Hospital – 3 మంది, Ravi Chaitanya Hospital – 1 వ్యక్తి.
రోగులకు సంబంధిత నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో సముచిత వైద్య చికిత్స అందించ బడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె వెంకటేశ్వర రావు తెలిపారు.
Prajavartha Online Telugu News