గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం (పి.యం.ఎం.ఎస్.వై) కింద మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.ఎన్.కిరణ్ కుమార్ తెలిపారు. గుంటూరు పట్టణం ఆనందపేటలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద అర్హులైన ముగ్గురు మత్స్యకారులకు 60 శాతం, 40 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మత్సకారులకు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మూడు చక్రాల వాహనాలు వలన ఇతర ప్రాంతాలకు వెళ్లి విక్రయాలు చేయవచ్చని, తద్వారా ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కె.శివప్రసాద్, గ్రామ మత్స్య సహాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News