Breaking News

నంబూరులో కొలాయిలకు రూ.50 లక్షల మంజూరు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామంలో ఇంటింటి కుళాయిలు ఏర్పాటుకు జల జీవన్ మిషన్ క్రింద రూ.50 లక్షలు మంజూరైందని గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. “తాగు నీరు అందితే ఒట్టు” శీర్షికన ఒక దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన వార్తపై ఆయన స్పందిస్తూ గ్రామ జనాభా 16300 ఉందని, గ్రామాన్ని పిడబ్ల్యుఎస్ పథకం కింద కవర్ చేయడం జరిగిందని వివరించారు. దీని మూలం గుంటూరు ఛానల్ కాగా, ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు.
ఓహెచ్‌ఎస్‌ఆర్ – 225 కిలో లీటర్లు, 200 కిలో లీటర్లు, 40 కిలో లీటర్లు సామర్ధ్యం గలవి ఉన్నాయని తెలిపారు. 60 కిలో లీటర్లు సామర్ధ్యం గల ఓ.ఎస్ హెచ్.ఆర్ మరియు ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుకు జల జీవన్ మిషన్ క్రింద రూ.50 లక్షలు మంజూరైందని చెప్పారు. పనులు దాదాపు పూర్తి అయ్యే దశలో ఉన్నాయన్నారు. ఎస్.టి కాలనీలో 2 పవర్ పంపులు, 2 హ్యాండ్ బోర్ బావులతో తాగునీటి సౌకర్యాలు కల్పించడం జరిగిందని, 2 పవర్ పంపులలో, ఒక పవర్ పంపు పనిచేస్తోందని, మరొక పవర్ పంపు మోటారు గత 3 వారాలుగా మరమ్మత్తులో ఉందన్నారు. మోటారు మరమ్మతులను గ్రామ పంచాయతీ చేపట్టిందని, రెండవ మోటారుకు రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి పని చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. హ్యాండ్ బోర్ మరమ్మతులను గ్రామ పంచాయతీ చేపట్టిందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *