Breaking News

సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్ళిన మంత్రి దుర్గేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు ఉత్సాహంగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ” శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారు భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలందించాలని, ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉంటూ అందరికీ మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *