Breaking News

సోమవారం పిజిఆర్ఎస్ – ‘మీకోసం’ మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

– కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం (16-03-2026) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదే విధంగా డివిజన్ మండల కేంద్రంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు

అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) కు నేరుగా కాల్ చేయవచ్చని ఆమె సూచించారు.

జిల్లా కేంద్రంతో పాటు డివిజన్ మరియు మండల స్థాయిలలో కూడా “మీకోసం”, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ డివిజన్ అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్‌కు హాజరవుతారని చెప్పారు. తహశీల్దార్లు తమ ప్రధాన కార్యాలయాల నుంచి హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని పేర్కొన్నారు. అదే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా జరుగుతుందని తెలిపారు. గ్రామ స్థాయిలో కూడా అర్జీలను స్వీకరించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు మరింత మెరుగ్గా పౌర సేవలను 95523 00009 వాట్సాప్ నెంబర్ ద్వారా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *