Breaking News

నిరంతరాయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో గృహ అవసరాలు మరియు అత్యవసర సేవల కోసం నిరంతరాయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇందుకోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరియు గ్యాస్ పంపిణీదారులతో నిరంతర సమన్వయం కొనసాగుతోందని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రతిరోజూ సుమారు 12,000 నుండి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు, మొత్తం 52 గ్యాస్ పంపిణీదారుల ద్వారా సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం పంపిణీదారుల వద్ద సుమారు 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
సాధారణ పరిస్థితుల్లో రోజువారీ రీఫిల్ బుకింగ్లు 11,000 – 11,500 మధ్య ఉండగా, రెండు రోజుల క్రితం వరకు అవి 22,000 – 22,500 వరకు బుకింగ్లు ఉన్నాయని , ఇది సాధారణ బుకింగ్ల కంటే దాదాపు 90% అధికం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రోజు వారి సగటు బుకింగ్ సంఖ్య 15000 నుంచి 16000 మధ్య ఉందని పేర్కొన్నారు. సిలిండర్ల సరఫరా మొదట బుక్ చేసిన వారికి మొదట (FIFO విధానం) ప్రకారం జరుగుతున్నందున కొంత జాప్యం కనిపిస్తోంది.
జిల్లాకు సిలిండర్లు సరఫరా చేసే గోకవరం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు సజావుగా పనిచేస్తున్నాయి. అవసరమైన స్టాక్ సమృద్ధిగా ఉంది. అక్కడి నుండి ప్రతిరోజూ గ్యాస్ పంపిణీదారులకు సరఫరా కొనసాగుతోంది.
అందువల్ల వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు. తప్పుడు సమాచారంతో అధిక బుకింగ్లు చేయడం, నిల్వ చేసుకోవడం (హోర్డింగ్) చేయకుండా అవసరమైన మేరకే బుకింగ్ చేసుకోవాలని కోరుతున్నారు.
జిల్లా గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.
హెల్ప్‌లైన్ నంబర్: 8074661259
ఒకేసారి అధిక సంఖ్యలో బుకింగ్లు చేయడం వల్ల కొంతమందికి కాల్స్ కనెక్ట్ కాకపోవచ్చని గుర్తించారు. వినియోగదారులు క్రింది మార్గాల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు:
* ఆయిల్ కంపెనీలు అందించిన WhatsApp నంబర్లు
* మిస్డ్ కాల్ సర్వీస్
* PhonePe, Google Pay, Paytm, Amazon Pay వంటి UPI యాప్స్

ఆయిల్ కంపెనీల వివరాలు
మూడు ఆయిల్ కంపెనీ
నిన్నటి బుకింగ్లు 13788 ;
నిన్నటి డెలివరీలు 10,839
ప్రస్తుత స్టాక్ 10,897
72 గంటలకు మించిన పెండింగ్లు 62,682
ఇదే క్రమంలో గ్యాస్ కంపెనీ ఏజెన్సీస్ వారిగా
IOC : 2,517 / 2,323 / 3,583 / 4,740

HPC : 707 / 83 / 10,564 / 8,433

BPC: 6,666 / 5,452 /648 / 3,422

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులలో 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

గమనిక :
ఏజెన్సీలు ఏరియా వారీగా బుకింగ్ నిర్ధారణ చేసే సమయంలో ఒకేసారి OTPలు జనరేట్ అవుతున్నాయి. OTP వచ్చినంత మాత్రాన సిలిండర్ డెలివరీ అయినట్లు కాదు. మొదట బుక్ చేసిన వారికి మొదటగా డెలివరీ జరుగుతుంది. సిలిండర్లు వినియోగదారుల ఇళ్ల వద్దకే వరుస క్రమంలో పంపిణీ చేయబడుతున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *