గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్, ప్రిన్స్ పల్ సెన్సెస్ అధికారి కె.మయూర్ అశోక్ తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా కమిషనర్ వివరాలను నమోదు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వచ్చంద స్వీయ గణన అందుబాటులో ఉంటుందని, ఈ విధానం ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారని తెలిపారు. ‘జనగణన-2027’ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన నిర్వహించి, ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరిస్తారని పేర్కొన్నారు. రెండో దశలో జనాభా గణన చేపట్టడం జరుగుతుందన్నారు. మే 1 తేదీ నుంచి 30 తేదీ వరకూ ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలియచేశారు. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 15 రోజులపాటు ప్రజలకు అవవగాహన కోసం కార్యక్రమాలు చేపడతామన్నారు. స్వీయ గణన షుమారు 2 నుండి 3 నిమిషాల్లో తేలికగా ఉందని, యువత పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్వీయ గణనలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.
Prajavartha Online Telugu News