విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్ పరిధిలో ఉన్న బాబు జగ్జీవన్ మున్సిపల్ స్కూల్లో హ్యాపీ ఫీట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన పిల్లలకు ప్లేట్స్ పంపిణి కార్యక్రంలో తూర్పు నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అవినాష్ మాట్లాడుతూ హ్యాపీ ఫీట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారిని అభినందిస్తూ, ఇలాంటి కార్యకరమ్మలు మరిన్ని చేయాలని అన్నారు. ప్రభుత్వం పిల్ల చదువు వారి తినే ఆహారం పట్ల ఎంతో శ్రద్ద చూపిస్తుంది అని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వారు అనింటిలోను ముందు ఉండి బాగా రాణిస్తారు అని అన్నారు. వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలలో విద్య మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన విద్యను అందిస్తన్నారు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు వల్ల తల్లిదండ్రలపై భారం తగ్గింది అని అన్నారు. విద్యతో పాటు మంచి భోజనం కూడా అందిస్తూ విద్య వ్యవస్థ పైన నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియచేశారు. ప్రభుత్వంతో పాటు ఇలాంటి మరిన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు వారి వంతు సాయం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రంలో 13వ డివిజన్ ప్రెసిడెంట్ రామాయణపు శ్రీనివాస్, 8 వ డివిజన్ ఇంచార్జ్ కొత్తపల్లి రజని మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …