Breaking News

ఏ ఒక్కరు వ్యాక్సినేషన్ కానీ వారు ఉండకూడదు…

-సర్వేను 100 శాతం చేపట్టి నాన్ వ్యాక్సినేషన్ వారిని గుర్తించాలి
-ఉద్యోగుల విధి నిర్వహణలో సమన్వయం తో కలిసి పనిచెయ్యాలి..
-ప్రతివారం మండల స్థాయి అధికారుల పనితీరు ను గ్రేడింగ్ ఇస్తాము
-రాష్ట్రస్థాయి సగటు కంటే ఎక్కువగా ప్రగతి సాధించాలి
-జి ఎస్ డబ్ల్యు, మీ సేవా పిర్యాదు లను పరిష్కరించాల్సిన బాధ్యత తహసీల్దార్ లదే.
-మీమీ బాధ్యతలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు..
-కలెక్టర్ కార్తికేయ మిశ్రా

కె.ఆర్.పురం (ఐటిడిఎ), నేటి పత్రిక ప్రజావార్త :
మీ మీ పరిధిలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చెయ్యడం లో వాస్తవికత ను చూపి, మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు.

బుధవారం సాయంత్రం స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్ పరిధిలోని హౌసింగ్, రెవెన్యూ , హెల్త్, పురపాలక, పంచాయతీ రాజ్, ఎన్ఆర్ఈజిఎస్, విద్యా, ఐసీడీఎస్, డిఆర్డీఏ, వ్యవసాయం, పౌర సరఫరాల, క్లాప్ ప్రోగ్రాం, ఉద్యానవన, మత్స్య శాఖల తదితర శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ అంశాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్ ఎల్ ఏ లక్ష్యాలను అధిగమించి మండల స్థాయి అధికారుల పనితీరు ఉండాలన్నారు. భవన నిర్మాణాలు, ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నమని, వాటికి సంబంధించిన డిజిటల్ రసీదులు తీసుకోవాలని ఆదేశించారు. వొచ్చే వారం సమీక్ష నాటికి మెరుగైన ఫలితాలు ప్రతిబింబించాలన్నారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు వసతి గృహాలు, విద్యా సంస్థలు నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలి. అక్కడ చదివే విద్యార్థుల భవిష్యత్ మనకు చాలా ముఖ్యం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రహదారుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు. కొయ్యలగూడెం.. జీలుగుమిల్లి ప్రధాన రహదారి సత్వరం మరమ్మత్తు లు పూర్తి చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 53 వేల మంది 18 ప్లస్ వయస్సు వారికి వ్యాక్సినేషన్ పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. వార్డుల వారీగా వాలంటీర్ల వారీగా వ్యాక్సినేషన్ చెయ్యవలసిన వారిని గుర్తించి లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పిఓ ఐటిడిఎ, ఆర్డీఓ లు సమగ్రమైన ప్రణాళికలు రూపొందించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. వాలంటీర్ ల పరిధిలో ఉన్న కుటుంబాల్లో ఏ ఒక్కరు వ్యాక్సినేషన్ కాకుండా ఉండకూడదు. కోవిడ్ సమయంలో ఏ ఒక్క ఫోన్ కాల్ వచ్చిందా ఎత్తడానికి భయపడే వాళ్ళం .. ఆ సంగతులు ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నారా.

మీసేవ ఫిర్యాదు లు, గ్రామ సచివాలయ ఫిర్యాదులు, వాటర్ ట్యాక్స్, హౌస్ సైట్స్, భూసేకరణ, ఈ కేవైసీ, తదితర అంశాలపై జేసి రెవెన్యూ బీఆర్ అంబేద్కర్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కి చెందిన రైతులకు చెందిన 22408 ఈ కేవైసీ లక్ష్యాలకు గాను 76 శాతం పూర్తి చేసారని, నూరు శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.

జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం) సూరజ్ గానోరె మండల వారీగా గృహనిర్మాణ ల స్థాయి పై ప్రగతి ని సమీక్షించారు.

జేసి అభివృద్ధి హిమాన్షు శుక్లా ఎంపిడిఓ ల ప్రగతి ఐదు అంశాల ఆధారంగా సమీక్ష నిర్వహించారు. భవనాలు, సేవలు, ఉపాధిహామీ, సచివాలయ సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య అంశా ల వారీగా సమీక్షించారు. ఆర్భికెలు, హెల్త్ క్లినిక్ భవనాలు,సచివాలయ భవనాలు, బి.ఎమ్.యు. లు, ఉపాధిహామీ పనులు,పై సమీక్ష చేసి భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ,జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం) సూరజ్ గానోరె , పిఓ ఐటిడిఎ ఓ. ఆనంద్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వై వి ప్రసన్న లక్ష్మీ, జిల్లా అధికారులు , జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, బుట్టయిగూడెం, కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *