Breaking News

మే 18 సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), భూసంబంధ ఫిర్యాదుల పరిష్కార వేదిక (రెవెన్యూ క్లినిక్) కార్యక్రమాలు సోమవారం (మే 18న) యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరై ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే, డివిజన్ పరిధిలో డివిజన్ పరిపాలన అధికారి, మండల పరిధిలో తహశీల్దార్లు , ఇతర అధికారులు మున్సిపాలిటీ స్థాయిలలోనూ సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు . ప్రజలు తమకు సమీపంలోని కార్యాలయాలలో వినతులు అందజేయవచ్చని ఆమె సూచించారు.

ప్రజలు meekosam.ap.gov.in వెబ్‌సైట్ ఆన్లైన్లో ద్వారా కుడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 95523 00009 నంబరుకు ఫిర్యాదులను పంపవచ్చని, పౌర సేవలు పొందవచ్చునని తెలియ చేశారు. పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *