Breaking News

జెడ్పీ టిసి, ఎంపీటీసీ, సర్పంచ్ వార్డు స్థానాలకు నవంబర్ 18న కౌంటింగ్

-కొవ్వూరు పురపాలక సంఘం 23వ వార్డుకి నవంబర్ 17న కౌంటింగ్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు పరిధిలో ఒక జెడ్పీటిసి, 7 ఎంపిటిసి 5 గ్రామ పంచాయతీ వార్డులు, కొవ్వూరు పురపాక సంఘం లోని ఒక వార్డు స్థానాలకు ఎన్నికలను నిర్వహించడం జరుగుతోందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. ఇందుకోసం 85 పోలింగ్ కేంద్రాల ను గుర్తించడం జరిగిందన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్డీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి /జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు గతంలో ఎన్నికలు నిర్వహించని, గుర్తింపు పొందిన పార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించినందున, గెలుపొందిన అభ్యర్థులు మరణించడం, పదవికి రాజీనామా చెయ్యడం తదితర కారణాలతో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. పెనుగొండ జెడ్పిటిసి స్థానానికి ఎన్నికల ను నిర్వహిస్తున్నామన్నారు . ఏడు ఎంపిటిసి స్థానాల్లో అత్తిలి మండలంలో ఈడూరు, పాలూరు , చాగల్లు లో చాగల్లు-5, ఇరగవరం లో కె. కుముదవల్లి, పెరవలి లో కానూరు-2, నిడదవోలు లో తాళ్లపాలెం, తాళ్లపూడి లో వేగేశ్వరపురం-2 స్థానాలకు ఎన్నికల ను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.

కొవ్వూరు డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన 5 గ్రామ వార్డుల కు ఎన్నికల ను చేపడుతున్న ట్లు మల్లిబాబు పేర్కొన్నారు. చాగల్లు మండలం ఎస్. ముప్పవరం గ్రామంలో 3వ వార్డుకి, గోపాలపురం లో చెరుకుమిల్లి గ్రామంలో 7వ వార్డుకి, కొవ్వూరు లో కాపవరం గ్రామంలో 9వ వార్డుకి, పెరవలి మండలం లో అన్నవరప్పాడు గ్రామంలో 12వ వార్డుకి, మల్లేశ్వరం గ్రామంలో 8వ వార్డు కి ఎన్నికల ను నిర్వహిస్తున్నామన్నారు. కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో 23వ వార్డు కి ఎన్నికలు జరగనున్నాయన్నారు. సోమవారం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో కి వొచ్చిందన్నారు. బుధవారం నుంచి నామీనేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. 5 వతేది సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నవంబర్ 6న నామినేషన్లు పరిశీలిన, 7వ తేదీ అభ్యంతరాలపై అప్పీలేట్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చునని, 8వ తేదీన వాటిపై నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. 9వ తేదీ 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరణ గడువు, అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ను సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారన్నారు. 16వ తేదీ ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్ జరుగుతుందని, ఒకవేళ రిపోలింగ్ నిర్వహించాల్సి వొస్తే 17 వతేది రిపోలింగ్ చేపడతారని పేర్కొన్నారు. నవంబర్ 18వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి, అనంతరం ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు.

కొవ్వూరు 23 వ వార్డుకు
కొవ్వూరు మునిసిపాలిటీ పరిధి లోని 23వ వార్డు కి 3వ తేదీ బుధవారం నుంచి 5 వతేది సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నవంబర్ 6న నామినేషన్లు పరిశీలిన, 8వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ను సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారన్నారు. 15వ తేదీ ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్ జరుగుతుందని, ఒకవేళ రిపోలింగ్ నిర్వహించాల్సి వొస్తే 16 వతేది రిపోలింగ్ చేపడతారని పేర్కొన్నారు. నవంబర్ 17 వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి, అనంతరం ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *