Breaking News

సమిశ్రగూడెం చెరువు సరికొత్త లుక్..రూ.50 లక్షలతో చెరువు సుందరీకరణ

-రూ.50 లక్షల నిధులతో సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్
-సమిశ్రగూడెం చెరువు చెంతన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌తో పర్యాటక శోభ..నిడదవోలులో మారనున్న చెరువుల రూపురేఖలు
-పశు సంపద రక్షణకు ఇప్పటికే గోకులం షెడ్డులు ఏర్పాటు..త్వరలోనే నిడదవోలు రూరల్ పరిధిలో ‘కాటిల్ హాస్టల్’ నిర్మాణం చేపడతామని వెల్లడి
-కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం..నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి నా బాధ్యత..మంత్రి కందుల దుర్గేష్ హామీ
-సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ దిశగా ఏపీ అడుగులు వేస్తున్నామన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో (MGNREGS, WDC, PMKSY 2.0 నిధులు) చేపట్టనున్న సాంప్రదాయ నీటి వనరులు, చెరువుల పునరుద్ధరణ నిర్మాణ పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలో ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ఆర్థికవృద్ధిపరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నిడదవోలు సమీపంలో ఇప్పటివరకు ప్రభుత్వ కళాశాల మినహా వాకింగ్ చేయడానికి సరైన వసతులు లేవని, అందుకే సమిశ్రగూడెంలోని ఈ చెరువును ప్రత్యేక శ్రద్ధతో సుందరీకరిస్తున్నామన్నారు. ఇక్కడ చిన్నారులు ఆడుకునేలా, పెద్దలు సేదతీరేలా, వ్యాయామ పరికరాలతో కూడిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా నిడదవోలులోని మాలకోడూరు చెరువు అభివృద్ధికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, ప్రజల కోరిక మేరకు మరో చెరువు వద్ద కూడా త్వరలోనే వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో పాటు రూ.3 లక్షల దాతల సహాయంతో 800 మీటర్ల ఫెన్సింగ్, ఆర్సీసీ బెంచీలు, చుట్టూ గ్రీన్ గ్రాస్ (పచ్చగడ్డి), ఆయిల్ ఫామ్ చెట్ల పెంపకం, రివిట్ మెంట్ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. పరిశ్రమల అధిపతులు, దాతలు మరికొంతమంది ముందుకు వస్తే ఈ ప్రాంతాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని, తద్వారా స్థానిక చిన్న వ్యాపారులకు ఉపాధి లభిస్తుందని ఆకాంక్షించారు.
ఈ ప్రాంతానికి మరింత శోభ తెచ్చేలా సమీపంలో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన మంత్రి దుర్గేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, దీపం-2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం,మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా లబ్ధిదారులకు చేకూరుతున్న ప్రయోజనాలను వివరించారు. స్పౌజ్ పెన్షన్లతో పాటు త్వరలోనే ఎన్టీఆర్ భరోసా క్రింద రూ.4000 ఇచ్చే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు. కులమతాలకు అతీతంగా తమ గ్రామ చెరువును సుందరంగా మార్చుకునేందుకు సమిశ్రగూడెం గ్రామస్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

మనుషులకు రక్షణగా ఇళ్లు ఉన్నాయని, అదే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పశుసంపద ఎంతో ముఖ్యమని ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో భారీ ఎత్తున ఇప్పటికే గోకులం షెడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. నిడదవోలు రూరల్ పరిధిలో పశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం ‘కాటిల్ హాస్టల్’ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

“ప్రజలు అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరుతూ…నిడదవోలు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధిని చూసుకునే పూర్తి బాధ్యత మీ ఎమ్మెల్యేగా నాదే.” అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. మంత్రి దుర్గేష్ భరోసాతో స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *