Breaking News

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా
పడమట దర్శిపేట సర్కిల్ నందు అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినీ రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన నటనతో పాటు సాంకేతిక పరంగా కూడా ఎన్నో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారని అవినాష్ గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చలపాటి సన్నీ,చింతల సాంబయ్య, శెటికం దుర్గ,SK బాజి, కల్లూరి కోటి, సుభాని, మోహన్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *