Breaking News

క్యాపిటల్‌ ఆస్పత్రిలో గైనకాలజీ వర్క్‌షాప్‌..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని క్యాపిటల్‌ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌, ఐఎంఏ విజయవాడ చాప్టర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘లైవ్‌ అడ్వాన్స్‌డ్‌ మినిమల్లీ ఇన్వేసివ్‌ గైనకాలజీ వర్క్‌షాప్‌’ నిర్వహించారు. ఆదివారం అన్నయ వారి కళ్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ వైద్య నిపుణులు సుమారు 20 సంక్లిష్ట శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ వర్క్‌షాప్‌కు 200 మందికి పైగా వైద్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ మన్నే మాట్లాడుతూ మహిళలను వేధిస్తున్న ఎండోమెట్రియోసిస్‌ సమస్యకు అత్యాధునిక 3డీ ల్యాపరోస్కోపీ విధానం ఎంతో మేలు చేస్తుందని, దీనివల్ల రోగులు త్వరగా కోలుకుంటారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే అతి తక్కువ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఈ టెక్నిక్‌ను వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని వర్క్‌షాప్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ అశ్వినీ పేర్కొన్నారు. వైద్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులపై ఇటువంటి అవగాహన సదస్సులు నిపుణుల నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయని ఏపీఎంసీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి. రమేష్‌, అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముంబై, నాగపూర్‌, కేరళకు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు…

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *