Breaking News

లింగనిర్ధారణ నిషేధ చట్ట ఉల్లంఘనపై సమాచారం కొరకు టోల్ ఫ్రీ నంబర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడ శిశువుల సంరక్షణ కొరకు బ్రూణహత్యల నివారణకై అమల్లో ఉన్న పీసీపీఎన్డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 18002332447 ను ఏర్పాటు చేసిందని ,పీసీపీఎన్డీటీ చట్టాన్ని
ఉల్లంఘించేవారి గురించి సమాచారం ఇచ్చేందుకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చని, సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తి గోప్యనంగా ఉంచుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా, వీ.బాలకృష్ణనాయక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.గర్భంలో పెరిగే శిశువు ఆడా, మగా అని చెప్పడం,లింగనిర్ధారణ సేవలను ప్రచారం చేయడం, ప్రోత్సహించడం చట్ట విరుద్ధం.ఇటువంటి కార్యకలాపాలు సమాజంలో లింగ అసమానత్వాన్ని పెంచి ఆడ శిశువుల జనన నిష్పత్తిని తగ్గిస్తాయి.ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు అమల్లో ఉన్న పీసీపీఎన్డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. కావున పై చట్ట ఉల్లంఘన గురించి ప్రజలెవరైనా 18002332447 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ,అందిన ప్రతి ఫిర్యాదును అధికారులచే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓగారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *