Breaking News

“స్టాప్ డయేరియా ” కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి చేతుల మీదుగా, పిల్లల్లో వచ్చు అతిసారాన్ని, నివారించుటకు, ఈనెల 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు, నిర్వహించు “స్టాప్ డయేరియా ” కార్యక్రమం యొక్క వాల్ పోస్ట్ ను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పుట్టినది మొదలు ఐదు సంవత్సరాలలో పిల్లలు ఎవరూ కూడా ఈ డయారియాతో మరణించకుండా “జీరో డెత్ డ్యూ టు డయేరియా” లక్ష్యంతో నిర్వహించాలని, ఈ వయసు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి, జిoక్ టాబ్లెట్లు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచి ఇవ్వాలని, త్రాగునీటి పరిశుభ్రతను తెలియజేయాలని, ఇదే విధంగా చేతులు పరిశుభ్రతను తెలుపుతూ డెమోనిస్ట్రేషన్ చేసి, తెలియజేయాలని ఇందుకు ప్రతి ఒక్క ఏఎన్ఎం, ఆశ నడుంబిగించి, ప్రతి ఒక్కరికి, మరియు ప్రతి తల్లికి ఆరోగ్య విద్యా బోధన చేయాలని, ఐసిడిఎస్ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్విరామంగా లక్ష్యసాధనకు, కృషి చేస్తూ నిర్వహించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమమునకు జాయింట్ కలెక్టర్ ఇలక్కీయా , డిఆర్ఓ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఇందుమతి దేవి, జిల్లా ఇమ్యూనికేషన్ అధికారి డాక్టర్ శరత్ బాబు, జిల్లా మలేరియా అధికారి రాజు నాయక్, డాక్టర్ సుమన్, డాక్టర్ సునీల్ పాల్గొనడం జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *