విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 2001 నుండి అక్టోబర్ 2021 వరకు 8 నెలల వేతనాలు బకాయలు వెంటనే చెల్లించాలని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఆర్గనైజేషన్ ఆంద్రప్రదేశ్ స్టేట్ కమిటీ కోరుతుంది. ఈ సందర్బముగా విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆదుకోవాలని కోరారు. మాజీ సైనికులు స్పెషల్ పోలీస్ ఆఫీవర్ లుగా నియమించడం హర్షదాయకం అన్నారు. సరిహద్దుల్లో ఎండ అనక వాన అనక కష్టపడి, మద్యం, గుట్కా, గంజాయి ఇసుక అక్రమరవాణా అరికట్టి కరోనా కష్ట కాలంలో ఎనలేని సేవలు అందించమన్నారు.ఇంతవరకు మీరు ఉన్నారని ఆశతో విధులు నిర్వహిస్తున్నామని మేము ప్రభుత్వ వ్యతిరేక కాదన్నారు.ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తక్షణమే వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రెసిడెంట్ శివ ప్రసాద్ కుమార్, సెక్రటరీ ఆర్ వెంకట నాయుడు, కోశాధికారి కే.కే.కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …