మానసిక వికాసానికి పుస్తకపఠనం ఎంతో అవసరం….

-పుస్తకం జ్ఞానంతో పాటు బ్రతుకు తెరువును చూపిస్తుంది….
-జిల్లా కలెక్టర్ జె. నివాస్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మానసిక వికాసానికి, విజ్ఞానం పెంచుకోవడానికి పుస్తక పఠనం ఎకైక మార్గమని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను జ్వోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయాల్లో అన్ని విభాగాలను సందర్శించి పుస్తకాలను పరిశీలించారు.
ఈసందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పుస్తకం జ్ఞానంతో పాటు బ్రతుకు తెరువును చూపించి ఒక నిండు జీవితాన్ని అందిస్తుందన్నారు. కవులు, రచయితలూ ఎంతో కష్టపడి రచనలు చేసి డబ్బు వెచ్చించి పుస్తకాలు ముద్రిస్తారన్నారు. వాటిని మీరు కొని చదివే పని లేకుండా గ్రంథాలయాలు పాఠకులకు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయన్నారు. ప్రతీ రోజు ముఖ్యంగా విద్యార్థులు తమ పాఠ్యపుస్తకంతోపాటు ఒక గంట లైబ్రరీలోని ఇతర పుస్తకాలు, తమకు ఇష్టమైన పుస్తకాలు తప్పక చదవాలన్నారు. అప్పుడే విద్యార్థులు ఐఎఎస్, ఐపిఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు పొందగలుగుతారన్నారు. రచయితలకు రెండు అవార్డులిస్తారని అవి ఏమిటో మీకు తెలుసా అన్ని విద్యార్థులను కలెక్టర్ నివాస్ ప్రశ్నించారు. దీనిపై విద్యార్థుల నుంచి జ్ఞానపీఠ, సాహిత్య అకాడమి అని జవాబు వచ్చింది. దీని పై ఆ రెండు అవార్డుల ప్రాముఖ్యత గురించి చాలా స్పష్టంగా విద్యార్థులకు కలెక్టర్ వివరించారు. ఈ విషయాలతో పాటు పుస్తకం ముద్రణ వెనుక ఉన్న కష్టాన్ని కూడా కలెక్టర్ చాలా చక్కగా వివరించారు. విజయవాడలో ఇంతకు ముందు ఎన్నడు ఎవరూ చెప్పని పుస్తకాలకు సంబంధించిన విషయాల్ని కలెక్టర్ నివాస్ చెప్పి పుస్తక ప్రియుల్ని ఎంతో ఉత్సాహాపరిచారు. జాయింట్ కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని పేర్కొన్నారు. పుస్తక పఠనంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకుని ప్రయోజకులు కావాలన్నారు. సాహితీ వేత్త డా. గుమ్మా సాంబశివరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తొలుత కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కంచల నాగరాజు, అతిధులకు స్వాగతం పలికి గ్రంథాలయ వారోత్సవాల ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రామచంద్రుడు, కళ్లేపల్లి మధుసూదనరాజు, వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *