-ఉత్సహంగా పాల్గొన్న చిన్నారులు… నగరంలో సందడి చేసిన బాలోత్సవ్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించిన బాలోత్సవ్ కార్యక్రమం ఉత్సాహాభరిత వాతావారణంలో కన్నుల పండువుగా జరిగింది. తీన్మార్ వాయిద్యాలు, లంబాడి, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో, మారువేషల కళకారులతో బాలోత్సవ్ కార్యక్రమ ప్రాంగణం పండుగా వాతావారణం నెలకొంది. ఆదివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించిన బాలోత్సవ్ 2021ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ జె.నివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. తొలుత పోలీస్ శిక్షణ డాగ్ రాంబో పుష్పగుచ్చాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కు అందజేసి సెల్యూట్ చేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రత్యేకతను, ప్రతిభపాటవాలను, సృజనత్మాకతను వెలికి తీసేందుకు బాలోత్సవ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రపంచం, సమాజంలో ఉన్న వివిధ రంగాల్లో అంశాలు, ముఖ్యంగా సైన్స్, పర్యావరణం, పౌష్టిక విలువలు, సాంస్కృతిక, కళలు తదితర అంశాలను పిల్లలకు నేర్పించవల్సిన, అవగాహన కల్పించవల్సిన అవశ్యకత మనపై ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బాలోత్సవ్ -2021 జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఊహించదానికన్న మిన్నగా స్పందన రావడం ఆనందదాయకంగా వుందన్నారు. పిల్లలందరికి ఈ కార్యక్రమం ద్వారా వివిధ సాంస్కృతిక, క్రీడ, డ్రాయింగ్, నృత్యం, సంగీతం, పాటల పోటీలు అంశాలతో ఉల్లాసం, ఉత్సాహం కలిగించడంతోపాటు సైన్స్, పర్యావరణం, విద్య, క్రీడలు తదితర అంశాలపై అవగాహన కలిగించే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశ భవిష్యత్ కు మార్గదర్శకులుగా ఉన్న పిల్లలను బాగా చూసుకోవల్సిన భాధ్యత మా తరం పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రదర్శనల్లో ఉత్తమమంగా నిలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పాల్గొన్న ప్రతీ ఒక్కరికి సర్టిఫికెట్లు అందజేయబడతాయన్నారు. విజయం సాధించని వారు ఎవరు బాధపడనవసరం లేదని ప్రదర్శనలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ విజేతలేనని ఆయన స్పష్టం చేశారు. ధైర్యంగా భయంలేకుండా మీ ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మరింత ఆరంగంలో రాణించవచ్చున్నారు. పిల్లల్లో స్ఫూర్తి నింపడానికే బాలోత్సవ్ -2021 నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలందరికి మంచి భవిష్యత్ కలగాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.బాలోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్ తో పాటు ఫ్లవర్ షో, పెట్ షో, వివిధ రకాల అమ్యూజ్ మెంట్ కార్యక్రమాలు, మ్యాజిక్ షో, పపెట్ షోతో పాటు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ పిల్లలో ఆనందాన్ని నింపాయి. కిడ్ జోన్లో పిల్లలు ఉల్లాసంగా ఆడుకున్నారు. ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్ ను అటవీశాఖ, వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను, ప్రముఖ సంగీత విధ్వంసులను తెలిపే ఛాయచిత్ర ప్రదర్శన, వివిధ సంగీత వాయిద్యాల స్టాల్ ను, ప్రముఖ క్రీడాకారులతో కూడిన ఛాయచిత్ర ప్రదర్శన కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం విద్యార్థినులు తయారు చేసిన హస్త కళ ప్రదర్శన సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్, గిరిజన సంక్షేమ శాఖ స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ తిలకించారు. పిల్లల్లో ఉత్సాహం నింపిన కిడ్ జోన్.. బెలూన్ షూటింగ్, బౌన్సింగ్ బెడ్, బుల్ రైడ్, రింగ్ గేమ్, టాస్ దబాల్, ట్రాంబోలైన్ వంటి వాటితో ఏర్పాటు చేసిన కిడ్ జోన్లో చిన్నారులంత ఎంతో ఉత్సాహాంగా ఆడుకున్నారు.
వీరి వెంట విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, డిఇఓ తహేర సుల్తానా , ఏపిసి సమగ్ర శిక్ష శేఖర్, డిడి బిసి వెల్ఫేర్ లక్ష్మి దుర్గ, డిడి సాంఘిక సంక్షేమ శాఖ సరస్వతి, డియంహెచ్ వో యం. సుహాసిని, వియంసి ఇన్ చార్జి కమిషనర్ యు. శారద, ఐసిడిఎస్ పిడి ఉమాదేవి,
రాగూర్ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి నాగరాజు, డిఎస్ డుబ్ల్యుఓ శ్రీనివాసరావు, ఉద్యాన, వియంసి, విద్య, రెవెన్యూ, అటవీశాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.