సత్ప్రవర్తనతో జీవించే ఆలోచనకు నాందిగా శిక్షా కాలాన్ని వినియోగించుకోవాలి: ఖైదీలకు ఉద్బోదించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్.

-విజయవాడలోని జిల్లా జైలును సందర్శించిన జిల్లా కలెక్టర్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
సత్ప్రవర్తనతో జీవించే ఆలోచనకు నాందిగా శిక్షా కాలాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా జైలు లోని ఖైదీలకు ఉద్బోధించారు. స్థానిక జిల్లా జైలు ను ఆదివారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ చాలామంది ఉద్రేకం, క్షణికావేశంతో నేరాలకు పాల్పడుతుంటారని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పన్నారు. జైలు జీవితం కుటుంబాల పట్ల సమాజంలో ఒక చులకన భావం ఉంటుందని, సమాజంలో అటువంటి భావం పోయేందుకు జైలు జీవితం అనంతరం మంచి వ్యక్తులుగా జీవించేందుకు ఇప్పటినుండే ఆలోచన చేయాలన్నారు. గతాన్ని మరిచిపోయి శిక్షాకాలం అనంతరం భవిష్యత్తులో సానుకూలమైన పరిస్థితులలో సత్ప్రవర్తనతో కూడిన జీవితాన్ని రూపొందించుకునేందుకు శిక్షా కాలం ఒక నాంది కావాలన్నారు. మీకు జైలు శిక్ష కారణంగా మీ కుటుంబాలు రోడ్డున పడకుండా వారి జీవనానికి అవసరమైన ఉపాధి అవకాశాలను ప్రభుత్వ పరంగా కల్పిస్తామన్నారు. అండర్ ట్రయిల్ కేసులు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. అనంతరం జైలులోని వంట గదులు, ఖైదీలకు భోజన, విశ్రాంతి సదుపాయాలను, జైలులోని వివిధ విభాగాలను జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. ముందుగా ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్, జైలు సూపరింటెండెంట్ కె. రఘు, జైలర్ జి. రవిబాబు, డిప్యూటీ జైలర్లు ఎన్.గణేష్, గోపయ్య నాయక్, మెడికల్ ఆఫీసర్ డా. శ్రీనివాసరాజు, ప్రభృతులు పాల్గొన్నారు.
ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *