విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘము ఆదేశముల మేరకు ప్రారంభింపపడిన ఓటర్ల జాబితా సమగ్ర సంక్షిప్త సవరణ 2026 నందు ది.15.06.2026 వ తేదీ నుండి ప్రతి ఓటరుకు ఎన్యుమరేషను ఫారములు పంపిణీ ప్రక్రియ ప్రారంభింపబడినది. ఈ ప్రక్రియకు సంబంధించి 79-విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, మునిసిపల్ కార్పొరేషన్, విజయవాడ పరిధిలో నందు మొత్తం 2,56,980 ఓటర్లు కలరని, వారిలో ది.15.06.2026 తేదీ నుండి ఈ రోజు సాయంత్రం 4.00 గంటల వరకు అనగా 01.07.2026 తేదీ సాయంత్రం 4.00 వరకు బూత్ స్థాయి అధికారులు మొత్తం 2,49,755 ఎన్యుమరేషను ఫారములు ఓటర్లకు పంపిణీ చేసియున్నారనియు, ఎన్యుమరేషను ఫారములు పంపిణీ 97.19% శాతము అయి ఉన్నదని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి & ACG(G), VMC ఎ.రవీంద్ర రావు తెలిపారు. ఇందులో మొత్తం ఎన్యుమరేషను ఫారములు ఇప్పటివరకు 41,573 డిజిటైజేషను చేసి 16.18% శాతము చేయబడినవి అని, ఎన్నికల సంఘము ఆదేశముల మేరకు సదరు పంపిణి చేసిన ఎన్యుమరేషను ఫారములను ఓటర్ల వద్ద నుంచి సేకరించి వాటిని డిజిటైజేషను పూర్తి చేయవలసినదిగా అదేశించారు. సదరు విషయమై అందరు AERO లు మరుయు BLO లు, BLO-సూపర్వైజర్ తగు పర్యవేక్షణ జరిపి ఎన్నికల సంఘం వారు నిర్దేశించిన గడువు లోపు డిజిటైజేషను పూర్తి చేసే విధముగా తగిన చర్యలు తీసులోవలసినడదిగా అదేశించారు. ఈ విషయములో ప్రతీ రోజూ సాయంత్రం 4.00 గంటలకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి 79-Vijayawada West AC & ACG, VMC వారు పత్రికా ప్రకటన జారీ చేయుదురని తెలిపారు. తగు సమాచారము నిమిత్తము తెలియపరచడమైనది.
Tags vijayawada
Check Also
ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …
Prajavartha Online Telugu News