Breaking News

నరసరావుపేట APSACS ఏరియా ఆసుపత్రి సందర్శన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) ప్రాజెక్టు డైరెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్, ఐ.ఏ.ఎస్. నరసరావుపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న హెచ్‌ఐవీ నిర్ధారణ, చికిత్స మరియు నివారణ కార్యక్రమాల అమలును సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ICTC) మరియు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) సెంటర్లను సందర్శించి, ఇన్‌పేషెంట్ మరియు అవుట్‌పేషెంట్ విభాగాల రికార్డులు, క్రాస్ రిఫరల్ రిజిస్టర్లు, హెచ్‌ఐవీ పరీక్షల నిర్వహణ, రోగుల ప్రవాహం (Patient Flow) తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం PPTCT (Prevention of Parent to Child Transmission) సేవలను సమీక్షించి, గర్భిణుల నమోదు రిజిస్టర్, హెచ్‌ఐవీ పరీక్షల వివరాలు, పాజిటివ్ కేసుల నిర్వహణ, సేవల అందుబాటు, లక్ష్యాలకు అనుగుణంగా నమోదవుతున్న కేసులు మరియు రోగుల భారాన్ని (Patient Load) పరిశీలించారు. నరసరావుపేట కేంద్రానికి నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే మెడికల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, కౌన్సెలర్లు మరియు ఇతర సిబ్బందితో సమావేశమై హెచ్‌ఐవీ పరీక్షలు, రిఫరల్ వ్యవస్థ, చికిత్సలో చేరిక, రోగుల అనుసరణ (Follow-up), సేవల నాణ్యత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సంబంధిత అన్ని రికార్డులు, రిజిస్టర్లు మరియు కార్యక్రమాల అమలును పరిశీలించి, సేవల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నిర్దేశించిన 95–95–99 లక్ష్యాలను సాధించేందుకు హెచ్‌ఐవీ నిర్ధారణను మరింత విస్తరించడం, గుర్తించిన ప్రతి హెచ్‌ఐవీ బాధితుడిని తక్షణమే ART చికిత్సలో చేర్చడం, వైరల్ లోడ్ సప్రెషన్ సాధించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు. తర్వత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కార్యాలయం జిల్లా కలెక్టర్ Dr కృతిక శుక్ల IAS ని కలిసి HIV/AIDS ప్రోగ్రామ్ గురించి వివరించడం జరిగింది మరియు జిల్లాలో HIV పరీక్షలు నిర్వహణ కొరకు Mobile ICTC వాహనం కొరకు చర్చించి వాహనం ఏర్పాటు కోసం అనుమతి తీసుకోడం జరిగింది.
ఈ తనిఖీలో డా. శ్రీనివాస్ వర్మ, జాయింట్ డైరెక్టర్ (బేసిక్ సర్వీసెస్ డివిజన్), డా. మాధవీ లత, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి (DLATO), నరసరావుపేట, DISHA బృందం, సంబంధిత వైద్య అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *