Breaking News

ప్రశ్న రావణ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని ఖండిస్తున్నాం

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నించాడని, విమర్శించాడని, బూతులు మాట్లాడారంటూ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి పలు పోలీస్ స్టేషన్లో, కోర్టుల చుట్టూ తిప్పారు. ప్రతి చోట ఆయనకు బెయిలు వచ్చింది. ఏదేమైనా ప్రశ్న రావన్ను జైలుకు పంపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయా ప్రభుత్వాలకు పోలీసులు బానిసలవలె పనిచేయటం పరిపాటిగా మారింది. ఉపా చట్టం ఏ రకంగా వర్తిస్తుందో పోలీసు యంత్రాంగమే సమాధానం చెప్పాలి. దేశద్రోహులుగా ఉన్న వారికి మాత్రమే ఉపా చట్టం వర్తిస్తుందనేది గుర్తించాలి. ఒక చట్టం వర్తిస్తుందా లేదా అనే విచక్షణ లేకుండా ప్రశ్నా రావణ్ పై ఉపా చట్టం ప్రయోగిస్తున్నారు. దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాం.

రాజకీయాల్లో పరస్పర విమర్శలు చేయవచ్చు. కానీ బూతులు మాట్లాడటం సరైనది కాదు. సభ్య సమాజం ఈ వైఖరిని కచ్చితంగా ఖండించాలి. కానీ ఉపా వంటి చట్టాలను దుర్వినియోగం చేయటం విచారకరం. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రజాసంఘాలు, పౌర హక్కుల సంఘాల ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఒకవైపు కోరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న కారణం చూపి ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం నమోదు చేయటం తగదు. తమకు ఎదురు మాట్లాడితే ఎంతకైనా తెగించి వారిని జైల్లో పెడతామనే హెచ్చరిక చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇటువంటి చర్యలకు పూనుకోవడం విచారకరం. భారతదేశంలో ఎక్కడైనా విమర్శలు చేసిన వారిపై ఉపా చట్టం ఉపయోగించిన దాఖలాలు లేవు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ప్రశ్న రావణ్ పై ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *