Breaking News

కుప్పం క్లస్టర్ల నుంచి మెగాసిటీ మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తులు

-ఐటీసీ, వీఐఎస్వీ సంస్థలతో కుప్పం డెవలప్‌మెంట్ అథారిటీ ఎంఓయూ
-ప్రకృతి సేద్యమే భూమి ఆరోగ్యానికి శ్రీరామరక్ష
-ఆధునిక వ్యవసాయ విధానాలతో రైతులకు ప్రయోజనం
-కుప్పం రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మీయ పలకరింపు సమావేశం

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలోనే నదుల అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గంగా- కావేరి అనుసంధానం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు నీటి భద్రతను సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కుప్పంలో స్థానిక రైతులతో నిర్వహించిన ఆత్మీయ పలకరింపు సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతకుముందు సీఎం చంద్రబాబు సమక్షంలో స్థానిక రైతులకు ప్రయోజనం కలిగేలా ఐటీసీ సంస్థతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. కుప్పంలోని పండ్లు, కూరగాయల క్లస్టర్ల ద్వారా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరానికి ఉత్పత్తులు మార్కెటింగ్ చేసేలా ఈ ఒప్పందం జరిగింది. ఆధునిక, సుస్థిర వ్యవసాయ విధానాలు, ఉత్పత్తులకు విలువ జోడింపుపై కడాతో విశాలాక్షి ఇన్నోవేషన్స్ సస్టెయినబుల్ వ్యాల్యూ చైన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ…నీటి భద్రతతో పాటు పర్యాటకాన్ని కూడా కుప్పంలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. హంద్రీనీవా నీరు ఈ ప్రాంతానికి తరలించగలిగాం. శ్రీశైలం నుంచి కంగుంది వరకూ నీళ్లు వచ్చాయి. శ్రీశైలం మల్లన్న దగ్గరి శ్రీశైలం డ్యామ్ నుంచి తిరుపతి వెంకన్న దగ్గరున్న కల్యాణి డ్యామ్ వరకూ త్వరలోనే నీళ్లు తీసుకువస్తాం. మన దగ్గర పడిన వర్షాన్ని భూగర్భజలాలుగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన స్ట్రక్చర్ల నిర్మాణాలు జరగాలి. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్లను ప్రారంభించే సమయంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పరీవాహక ప్రాంతంలో నీటి పారుదలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. రైతుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు ప్రారంభించాం. గోదావరి- కావేరిని కలిపితే దక్షిణాదిలో నీటి కరవు తీర్చేందుకు ఆస్కారం ఉంటుంది.
దేశంలోని ఇతర నదులు కూడా అనుసంధానం చేసుకుంటేనే పరిస్థితులు మారతాయి. మహానది నుంచి కావేరి వరకూ- అలాగే గంగా నది నుంచి కావేరి వరకూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిలా నదుల అనుసంధానం జరగాలి. అదే జరిగిదే ఇక దేశానికి కరువు అనేదే రాదు. రైతులకు విస్తృత ప్రయోజనాలు అందుతాయ’ని ముఖ్యమంత్రి అన్నారు.

కుప్పం క్లస్టర్ల నుంచి ఉద్యాన ఉత్పత్తులు

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక ఆదాయం, మెరుగైన దిగుబడి సాధించేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. రైతులు ఆధునిక విధానాలను అనుసరించటంతో పాటు మెరుగైన మార్కెటింగ్ ను అందిపుచ్చుకోవాలి. కుప్పంలో నియంత్రిత వాతావరణంలో 10 వేల టన్నుల టమాటోలు పండించి ఎగుమతి చేసేలా ఐటీసీ సంస్థ ప్రణాళిక చేస్తుంది. వెయ్యి ఎకరాల్లో ఈ సాగు చేపట్టేందుకు ఐటీసీ ముందుకు వచ్చింది. ఆదర్శ రైతులు దీనికి సహకరించాలి. రూ.8 కోట్లను వ్యయం చేసి ఐటీసీ సంస్థ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. పౌల్ట్రీ, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. రూ.10 వేల కోట్ల మేర వివిధ ప్రాజెక్టులు కుప్పంలో వచ్చాయి. ఏబీఐఎస్, మదర్ డెయిరీ, ఐటీసీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. ఉద్యాన ఉత్పత్తులను సాగు చేయటంలో రాయలసీమ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుంది. పూర్వోదయ స్కీమ్ ద్వారా ప్రభుత్వం రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి వస్తాయి. రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెడతాయి. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పండ్లు, ఉద్యాన ఉత్పత్తులను సాగు చేసేలా ప్రణాళికలు చేద్దాం. ఆధునిక వ్యవసాయ విధానాలను, పరికరాలను రైతులు ఉపయోగించాలని కోరుతున్నాను” అని సీఎం స్పష్టం చేశారు.

ప్రకృతి సేద్యంతో ప్రయోజనాలు

పురుగుమందులు వాడకుండా ప్రకృతి సేద్యంతో మన రైతులు ప్రపంచానికి నమూనాగా నిలవాలని సీఎం అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు ఈ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. మన రైతుల కృషికి చేసిన పనికి గుర్తింపుగా స్విట్జర్లాండ్ లో ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రకృతి సేద్యం ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉద్యోగాలు వదిలి పెట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. గత సీజన్ లో రూ.4 చొప్పున తోతాపురి మామిడికి అదనపు ధర ఇచ్చామని.. రూ.259 కోట్ల మేర రైతులకు సాయం అందించామన్నారు. ఈసారి కూడా రైతులకు సాయం అందిస్తామన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం సందర్శించారు. మిల్లెట్ చెఫ్ పేరిట మైదా, పంచదార లేకుండా తయారు చేసిన బేకరీ ఫుడ్ స్టాల్ ను సీఎం ఆసక్తిగా పరిశీలించారు. ఆ సంస్థ రూపొందించిన రైస్ ఫ్రీ హోటల్ కాన్సెప్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు. మిల్లెట్ చెఫ్ బేకరీ లు కుప్పం లో రెండు ప్రారంభించాలని సీఎం కోరారు. అంతకుముందు ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడి సాగు విధానాలు తెలుసుకుని వారిని అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *