విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఘనంగా రూట్స్‌హెల్త్ ఫౌండేషన్ 13వ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆదివారం నగరంలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సమాజంలో వైద్యులు నిస్వార్థంగా అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, త్యాగాలకు గుర్తుగా, ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తున్న వైద్యులను సన్మానించడం తన అదృష్టమన్నారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతూ, వృత్తిని దైవంగా భావిస్తూ చేసే వృత్తి వైద్య వృత్తని అన్నారు. అనంతరం సేవాభావం, పనిపట్ల నిబద్ధత కలిగిన 11 మంది వైద్యులకు అవార్డ్స్ అందజేశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ వైద్యవృత్తికి రిటైర్మెంట్ లేదని, చివరి వరకు ప్రజలకు వైద్య సేవలను అందజేస్తారని అన్నారు. ఎంతో అనుభవమున్న సీనియర్ వైద్యుల సేవలను గుర్తు చేసుకుని యువ వైద్యులు స్ఫూర్తి పొందాలని సూచించారు. రూట్స్ చైర్మన్ డా. పీవీఎస్ విజయభాస్కర్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా 82 మంది వైద్యులకు అవార్డ్స్ ఇచ్చి సత్కరించామన్నారు.
రూట్స్ హెల్త్ సర్వీసెస్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును డాక్టర్ జి. లక్ష్మీప్రసాద్‌కు అందజేశారు. అదే విధంగా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పీఎనఎస్ మూర్తి, సీనియర్ గైనకాలజిస్టులు డాక్టర్ కోడే ప్రభాదేవి, డాక్టర్ అక్కినేని మణి, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎన్. కేశవరావు బాబు, డయాబెటాలజిస్ట్ డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జి.రమేష్, పల్మనోలజిస్ట్ డాక్టర్ కె అనీల్, జాయింట్ రీప్లే సిమెంట్ సర్జన్ డాక్టర్ పి. శివయ్యలతోపాటు, బెస్ట్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్‌గా డాక్టర్ కొండా వెంకటేశ్వర్లుకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమణమూర్తి, టి. అర్జునరావు, రూట్స్ సీనియర్ సభ్యులు ఎంఎసఆరఎ శర్మ, చందు శ్రీనివాస్, కొల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News