విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైస్తవుల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కే దక్కుతుందనీ ఉద్యోగ భారత్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ స్పష్టం చేశారు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో చంద్రబాబు పై పనికట్టుకోని మరి కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు ఇది ఎంత వరకు సమంజసం కాదని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు క్రైస్తవ విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్య కార్యదర్శిగా వివిధ హోదాల్లో ఆయనతో కలిసి పనిచేశాననీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల కోసం ఎన్నో సెమీ క్రిస్మస్ వేడుకలకు పాస్టర్ లు బిషప్, ఆర్చిబిషప్ లకి, మిషనరీలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి గౌరవించారనీ గుర్తు చేశారు. క్రైస్తవులకు, ముస్లింలకు కలిసి ఒకటే మైనారిటీ కార్పోరేషన్ గా ఉండేదని తాము క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్ కొరకు అడిగిన వెంటనే క్రిస్టియన్ లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదేనని ,ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి క్రైస్తవుల అభివృద్ధికి ఎప్పుడూ పాటు పడతారని జాన్ వెస్లీ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు చంద్రబాబు సీఎం అయినప్పుడు స్టేట్ డైరెక్టర్ గా పేదపాస్టర్ లకు 5000 రూపాయలు ధన సహాయం అడిగినప్పుడు చంద్రబాబు వెంటనే సమ్మతించారని వెల్లడించారు. టిడిపి క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడిగా , క్రిస్టియన్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గా వివిధ విభాగాల్లో పనిచేసినప్పుడు ఎన్నో క్రైస్తవ మందిరాలు కట్టించడానికి నిధులు విడుదల చేసినట్లు ఆయన స్పష్టం చేసారు.లోకేష్ బాబు ఎప్పుడు తాను వెళ్ళినా ఎంతో చక్కగా ఆప్యాయంగా పలకరిస్తారనీ క్రైస్తవుల అభివృద్ధి కి ఆయన కూడా ఎంతో కృషి చేస్తారని అన్నారు. క్రైస్తవులకు న్యాయం జరగాలంటే క్రైస్తవుల సమస్యలు పరిష్కారమవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు కి మాత్రమే సాధ్యం అవుతుంది కానీ మరొకరి వల్ల కాదని జాన్ వెస్లీ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ భారతి ఏపీ చైర్మన్ జాన్ వెస్లీ, ఉద్యోగ భారతి ఎన్టీఆర్ జిల్లా చైర్ పర్సన్ అంజనా దేవి, ముఖ్య కార్యదర్శి ఎం వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News