విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్‌నగర్‌లోని స్వామి వివేకానంద పాఠశాలలో ఆల్ ఇండియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆలా తారకరామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 8వ, 9వ, 10వ తరగతులకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమం సమాజాభివృద్ధికి పునాది అని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలిసే నాయకుడిగా కాకుండా, ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారంతో పాటు భావి భారత పౌరులైన విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మంచి విద్యను అందిస్తూ విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్న స్వామి వివేకానంద పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా అనేక సంస్కరణలు చేపడుతోందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని బొండా ఉమామహేశ్వరరావు గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, కొనుము రాణి, భవానీ, జాన్సీ, హరిణి క, రవి కుమార్, ఆఫ్రాజ్, బాజీ, హుస్సేన్, మాధవ, లోకేశ్, గురుమూర్తి, నాగరాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News