ఘనంగా ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గాన గంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను వచ్చే నెల 4 న విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలోని తమ ఛాంబరులో సాంస్కృతిక, పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై శాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా జిల్లా గుడివాడ మండలం చౌటపల్లి గ్రామంలో 1922 డిశంబరున 4 న జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు, తమిళం, కన్నడ మరియు మళయాళం తదితర భాషల్లో సుమారు 10 వేలకు పైబడి పాటలు పాడిన మహా గాయకుడన్నారు. తెలుగు వాడైన ఆ మహా గాయకుని శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ జయంతి వేడుకలను నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లకు అదేశాలు జారీచేయాలని రెవిన్యూ, పర్యాటక, క్రీడా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్కు మంత్రి సూచించారు. ఈ వేడుకల సందర్బంగా అన్ని జిల్లాల్లో పాటల పోటీలు నిర్వహించి ఉత్తమ గాయకులకు పురస్కారాలను అందజేయాలన్నారు. వీరి జీవిత చరిత్రను గ్రంధస్తంచేసి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పుస్తకాలను ఆవిష్కరించాలన్నారు.
డిశంబరు 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాధకద్రవ్యాల వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలను యువతకు తెలియపర్చే విధంగా అవగాహన సదస్సులు మరియు రక్తదాన శిభిరాలను, అవయువ దానంపై అవగాహనను అన్ని జిల్లాలలో నిర్వహించాలని, అందుకు తగ్గట్లుగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రెవిన్యూ, పర్యాటక, క్రీడా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ కు ఆయన సూచించారు. ఈ అవగాహనా సదస్సులు, రక్తదాన శిభిరాలను, అవయువ దానంపై అవగాహనను విజయవంతంగా నిర్వహించేందుకు యువజన శాఖ అధికారులు తగు శ్రద్ద చూపాలని ఆదేశించారు. అదే విధంగా నవంబరు 26 న జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు నిర్వహించేలా ఆయా విశ్వవిద్యాలయాల వి.సి.లకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేయాలన్నారు.
అనంతరం పర్యాటక శాఖ కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తూ పర్యాటక ప్రాంతాల ప్రాశస్త్యాన్ని అందరికీ తెయజేసే విధంగా విశాఖలో విశాఖ ఉత్సవాన్ని, కడపలో గండికోట ఉత్సవాన్ని మరియు అనంతపురంలో లేపాక్షి ఉత్సవాన్ని నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన స్పాన్సర్లను గుర్తించాలని, ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల సి.ఎస్.ఆర్. నిధులతో ఈ ఉత్సవాలను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వరల్డు హెరిటేజ్ ప్రాంతాల అభివృద్దిలో భాగంగా తెలంగాణాలో రెండు ప్రాంతాలను కేంద్రం గుర్తించిందని, అదే విధంగా రాష్ట్రంలోని లేపాక్షి, కొండపల్లి, పెడన, శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రాంతాలను వరల్డు హెరిటేజ్ ప్రాంతాలుగా గుర్తించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ కు ఆయన సూచించారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేకించి భవాని ఐలాడ్స్, పోచవరం, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాల్లో బోటింగ్ సౌకర్యాన్ని వెంటనే పునరుద్దరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోచవరం నుంచి గోదావరిలో బోటింగ్ సౌకర్యాన్ని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పైడిపాక లేదా రామాయంపేట ప్రాంతాల్లో బోటింగ్ పాయింట్ కోసం ఇరిగేషన్ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది కమాండ్ కంట్రోల్ సెంటర్లలో ఫర్నిచర్, ఎక్విప్మెంట్ వెంటనే సమకూర్చాలన్నారు. పర్యాటక సంస్థకు చెందిన 46 హోటళ్లలో కనీసం 34 హోటళ్లను డిశంబరు 1 కల్లా ఆపరేషన్ అండ్ మెయింటినెన్సు ఏజన్సీలకు అప్పగించాలని ఆదేశించారు. పర్యాటక సంస్థకు చెందిన అన్ని హోటళ్లలో నాణ్యమైన ఆహారం, వాటి నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని, వారానికి మూడు సార్లు కనీసం మూడు హాటళ్లను ఉన్నతాధికారులు ఆకస్మికంగా సందర్శించి ఈ అంశాలపై ప్రత్యేక దృష్లి సారించాలన్నారు. ప్రస్తుతం హైదరాబాదు నుండి తిరుపతికి విమాన సర్వీసుల ఉన్నాయని, అదే విధంగా బొంబాయి, డిల్లీ ల నుండి విమాన సౌకర్యాన్ని కల్పించే అంశంపై అధికారులు దృష్టిసారించాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా రెవిన్యూ, పర్యాటక, క్రీడా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ మాట్లాడుతూ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో హయాత్ హోటల్స్ నిర్మించేందుకు ముందుకు వచ్చారని మంత్రికి తెలిపారు. అదే విధంగా తిరుపతి, హార్సిలీ హిల్స్, పిచుకలంక, గండికోట, విశాఖపట్నం (అన్నవరం), ప్రాంతాల్లో ఒబేరాయ్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు వచ్చారని, ప్రభుత్వ జీవో విడుదలయ్యాక ఆయా సంస్థలతో ఎమ్ఓయూ లు కుదుర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా తిరుపతిలో రెండు, విశాఖపట్నంలో రెండు సర్ధార్ సరోవర్ హోటల్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం క్రీడా శాఖ కార్యక్రమాలను మంత్రి సమీక్షిస్తూ ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సీఎం కప్ టోర్నమెంట్స్ ను నిర్వహించాలని క్రీడా శాఖ అధికారులకు సూచించారు. ఖేలో ఇండియాలో భాగంగా ఎంపికైన ఉత్తమ క్రీడా జట్లను వచ్చే నెలలో హర్యానాలో జరుగనున్న నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలకు పంపాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి లభించిన వెంటనే కొత్త స్పోర్ట్స్ పాలసీ అమలులోకి తేవాలన్నారు. మాచర్ల, ఎర్రగొండపాలెం, కృష్ణలంక ప్రాంతాల్లో వైస్సార్ క్రీడా ప్రాంగణాలు త్వరలో ప్రారంబించాలన్నారు.
రెవిన్యూ, పర్యాటక, క్రీడా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్, సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లిఖార్జున, క్రీడా శాఖ టెక్నీకల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్వీ.రమణ, జూన్, మహేశ్ బాబు, ధర్మారావు, అజయ్ కుమార్, దేవానంద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *