అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల సాంకేతిక సామర్థ్యాలు, నిబద్ధత మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక సంబంధిత నేరాలలో కేసు నమోదు మొదలుకొని దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయడంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న DIG పాల రాజు IPS మరియు సాంకేతిక అధికారుల బృందాన్ని డిజి డిస్కులు అందించి DGP అభినందించారు.
కేసు నమోదు అయిన నాటి నుండి నిర్ణీత వ్యవధిలో (60 రోజులు) ఛార్జిషీట్ చేయబడిన కేసులలో 93.8% రేటుతో ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్(ITSSO) లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.దేశ వ్యాప్తంగా రాష్ట్రాలలో మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక సంబంధిత నేరాలలో నమోదయ్యే కేసులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తు పురోగతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(MHA) నిరంతరం పర్యవేక్షిస్తుంది. కాని ఇప్పటికే ఎపిలో కేసు దర్యాప్తు, విచారణ ను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ మెకా నిజం వ్యవస్థను అన్ని పోలీస్ యూనిట్ లలో నెలకొల్పింది పోలీస్ శాఖ.
ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ ఆఫన్సెస్…
రాష్ట్రం లోని మహిళలు, చిన్నారుల పైన జరిగే లైంగిక సంబంధిత నేరాల పై కేసు నమోదు మొదలకొని ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం నిరంతరం పర్యవేక్షిస్తుంది. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ మరియు వివిధ సంస్థల నుండి రావలసిన రిపోర్టులు విషయంలో సంబంధిత అధికారులకు మెసేజ్ ద్వారా అప్రమత్తం చేస్తుంది, కేసు ప్రాధాన్యతను గుర్తిస్తూ సంభందిత దర్యాప్తు అధికారిని SMS ద్వారా అనుక్షణం అప్రమత్తం చేస్తూ నిర్ణీత సమయం లో కేసు దర్యాప్తును పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడానికి సహకరిస్తుంది .అంతే కాకుండా వివిధ దశల్లో దర్యాప్తు వివరాలను బాధితురాలికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచార రూపంలో అందిస్తుంది.
ఇటీవల తిరుపతిలో జరిగిన అన్ని దక్షిణాది రాష్ట్రాల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ పోలీసుల పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత ప్రశంసలు అందుకుంది.
అంతేకాకుండా AP పోలీసుల పనితీరు అన్ని రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అందుకు ఉదాహరణ ఎపి ప్రభుత్వం మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన దిశ మరియు దిశ సంబంధిత కార్యక్రమాలే సూచిక.
ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నారు. అంతేకాకుండా వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఒక పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థను సృష్టించి ముందు చూపుతో ప్రణాళిక బద్ధంగా అనేక కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు సురక్షితంగా ఉన్నాం అనే భావన కల్పిస్తూ వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చొరవలతో పోలీసుల సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక నేరాల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయడం జరుగుతుంది.
క్రిమినల్ జస్టిస్ సిస్టం లో మూల స్తంభాలైన పోలీస్ శాఖ, జైళ్ల, న్యాయస్థానాలు మరియు మహిళా& శిశు సంరక్షణ శాఖ లన్నింటిని సమన్వయపరుస్తూ ఏకతాటిపైకి తీసుకువచ్చి అవసరమైన సందర్భంలో సంబంధిత కేసు వివరాలను ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం తో ఆన్ లైన్ ద్వారా సమన్వయ పరిచే విధానం ఈ ICJS(inter-operable criminal justice system)సిస్టం. ICJS విధానం ద్వారా ప్రతి ఒక్క పిల్లర్ కు సంభందించిన డాటా మిగిలిన పిల్లర్లకు చేరుతుంది అంతే కాకుండా ప్రతిఒక్క పిల్లర్ మిగిలిన పిల్లర్ల నుండి డాటా ను తిసుకుంటుంది. భాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పూర్తి స్థాయిలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడం ద్వారా సమయం ఎంతగానో ఆదా అవుతుంది. ఐ సి జె ఎస్ విధానంతో పౌరులకు అందిస్తున్న ఉత్తమైన సేవలలో రెండవ స్థానం నుండి మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ విభాగనికి అవార్డును సొంతం చేసుకుంది(NCRB-MHA).
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లోని ప్రజలకు సామాజిక న్యాయం, ముఖ్యంగా మహిళలు ,చిన్నారులు, సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాలకు చెందిన వారికి చేరుకునే విధంగా, వారికి మెరుగైన భద్రత కల్పిస్తున్నాము అనే భరోసా కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో గతంలో ఎన్నడు లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో తీసుకువస్తున్న సమూలమైన మార్పులు, సిబ్బంది లోని జవాబుదారీతనం ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా వస్తున్న మార్పులు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అత్యంత ఆధునిక టెక్నాలజీ ని వినియోగించడమే కాకుండా క్షేత్రస్థాయిలో దాని ఫలాలు రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తూ నిరంతరం ప్రజా రక్షణకు పాటుపడుతున్న పోలీసు శాఖను మనస్ఫూర్తిగా అభినందించారు.