వేటకు వెళ్ళి సముద్రం లో గల్లంతైన వారి కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి కొల్లు రవీంద్ర

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
చేపల వేటకు వెళ్లి సముద్రం లో గల్లంతయిన 6 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున 60 లక్షల రూపాయల పరిహారాన్ని రాష్ట్ర ఎక్సైజ్ ,గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర,MLA లు వంశీకృష్ణ యాదవ్,లోకం మాధవి ,జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ తదితరులు అందజేశారు. బుధవారం స్థానిక హార్బర్ మెకానైజ్డ్ బోటు అసోసియేషన్ భవనంలో మత్స్యకార కుటుంబాల తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఈ 10 లక్షలు మత్స్య శాఖ నుండి 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షలు అందించి ,అన్ని రకాలుగా ఆదుకుంటామని వారికి తెలిపారు.అనంతరం మంత్రి
కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల గల్లంతు విషయం ప్రభుత్వానికి సమాచారం అందిన వెంటనే అధికారులను, కోస్ట్ గార్డ్ వారిని అప్రమత్తం చేశామని, నావెల్, కోస్ట్ గార్డ్ గారితో గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రమాదం జరిగి 72 గంటలు దాటిన ఈరోజు వరకు వారి ఆచూకీ లభించకపోవడంతో కారి చిన్న ఇచ్చిన సమాచారం, కోస్ట్ గార్డ్ వారి నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ 6 కుటుంబాలకు మత్స్య శాఖ నుండి 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5 లక్షలు కలిపి మొత్తం 10 లక్షలు వారి కుటుంబాలకు అందించడం జరిగిందన్నారు.
బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన, బోటు మునిగిపోవడంతో నష్టపోయిన కారి చిన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 10 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు .హుద్ హుద్ తుఫానులో బోటు మునిగిపోతే 6 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇచ్చి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నష్ట పరిహారం అందజేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.గత ప్రభుత్వం లో మత్స్యకారులకు సంబంధించి నష్టపరిహారం కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయని వారికి ఒక్క పైసా కూడా పరిహారం ఆ ప్రభుత్వం ఇవ్వలేదని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల 15 లక్షల రూపాయలు విడుదల చేసి ఆ కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే బృతిని 20 వేలకు పెంచి అందించామని కొన్ని సాంకేతి కారణాలవల్ల ఈ ఏడాది కొంతమందికి ఆగాయని వారికోసం 9 కోట్ల రూపాయలు త్వరలో విడుదల చేసి నూరు శాతం మందికి అందిస్తామన్నారు.50 సంవత్సరాలకే పెన్షన్ ఫిషింగ్ బోట్ లకు ఆయిల్ సబ్సిడీ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానీ దేనిని, గత ప్రభుత్వంలో ఒక వల ముక్క కూడా మత్స్యకారులకు ఇవ్వలేదని ఆయన అన్నారు .మత్స్యకారులకు వలలు ,బోట్లకు సబ్సిడీ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. గల్లంతైన వారి ఆచూకీ లభిస్తుందని చూస్తున్నామని గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతాయని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో NTR వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, మార్కెటింగ్ ఫెడరేషన్ చైర్మన్, k.బంగార్రాజు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వర్ధన్, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సముద్రంలో గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు రగుతుల లక్ష్మి కే మౌనిక, మా, కే నారాయణమ్మ , ఎ .లక్ష్మి ,k.దమయంతి లకు మంత్రి రవీంద్ర చెక్కులు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *