విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ఆర్టీసీ కాలనీలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన పత్రీస్ గ్లామ్ లక్సీ సిగ్నేచర్ సెలూన్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ స్థాయి సంస్థ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫ్రాంచైజీని విజయవాడ వాస్తవ్యులైన పత్రి శ్రీనివాస్, తన కుమారుడి భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, మాట్లాడుతూ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ 4లోని మూడవ అంతస్తులో ఈ లగ్జరీ సెలూన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హెయిర్ కేర్, హెయిర్ సర్జరీస్, లేజర్ స్కిన్ ట్రీట్మెంట్స్, హైడ్రా ఫేషియల్స్, మనిక్యూర్ అండ్ పెడిక్యూర్, నైల్ లౌంజ్, హెయిర్ కలరింగ్ అండ్ హైలైట్స్, బ్రైడల్ మేకప్ వంటి అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. స్థానిక ప్రజలు ఈ సేవలను వినియోగించుకుని నూతన సంస్థను ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కాస్మోటిక్స్ కంపెనీల ప్రతినిధులు, సిబ్బంది, కస్టమర్స్, కుటుంబ సభ్యులు తదితరులు బాగున్నారు.
Prajavartha Online Telugu News