-జనవరి లోపు 100 శాతం నిధులు ఖర్చు చేయాలి
-ఎస్సి సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదు
-సబ్ ప్లాన్ నిధులు ప్రతి ఒక్క రూపాయి ఎస్సిలకే వినియోగించాలి
-ఎస్సిలు సమాజంలో అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం
-ఎస్సీల అభివృద్ధి కోసం అధికారులంతా చిత్త శుద్ధితో పనిచేయాలి
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
-అమరావతి సచివాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి అధ్యక్షతన నోడల్ ఏజన్సీ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సి సబ్ ప్లాన్ నిధులు వంద శాతం ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి అధ్యక్షతన నోడల్ ఏజన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సి సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై చర్చించారు. ఇప్పటివరకు ఎస్సి ప్లాన్ నిధులు ఎంత మేర ఖర్చు చేశారో డిపార్ట్మెంట్లు వారీగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది ఎస్సి సబ్ ప్లాన్ కి రూ. 20,643 కోట్లు కేటాయించాం. ఆ నిధుల్ని జనవరి లోపు 100 శాతం ఖర్చు చేయాల్సిందేనన్నారు. డిపార్ట్మెంట్లు వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని నిధుల్ని వినియోగించుకోవాలన్నారు. ఎస్సి సబ్ ప్లాన్ నిధుల్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని, సబ్ ప్లాన్ నిధులు ప్రతి ఒక్క రూపాయి ఎస్సిలకే వినియోగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు. ఎస్సిలు సమాజంలో అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని, ఎస్సిల అభివృద్ధి కోసం అధికారులంతా చిత్త శుద్ధితో పనిచేయాలని
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు లావణ్య వేణి, మత్స్యశాఖ ఎక్స్ అఫీషియో కమీషనర్ రామ్ శంకర్ నాయక్,స్త్రీ శిశు, వయోవృద్ధుల సంక్షేమం శాఖ డైరెక్టర్ యం.వేణు గోపాల్ రెడ్డి,లిడ్ క్యాప్ ఎండి ప్రసన్న వెంకటేశ్,సిడిఎంఏ జి.సంపత్ కుమార్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News