Breaking News

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం 7వ డివిజన్ శిఖమణి సెంటర్ నందు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం తో కలిసి పర్యటించిన అవినాష్ జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుండి కూడా వైయస్ కుటుంబానికి అండగా ఉన్న ఈ డివిజన్ లో గత టీడీపీ ప్రభుత్వం లో నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసారని కానీ నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రోడ్లు, మంచి నీటి పైప్ లైన్, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణలు చేపట్టి అభివృద్ధి చేస్తున్నామని అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆ నమ్మకంతో నే ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారని,ఆ నమ్మకం నిలబెట్టుకొనే విధంగా మాధురి నిత్యం ప్రజలలో తిరుగుతూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వనికి మద్దతుగా నిలవడం గర్వంగా ఉందని అందుకు నిదర్శనమే కుప్పంతో సహా ప్రతి మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం అని,రాబోయే 30 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి గా ఉంటారని ఇక రాష్ట్రంలో టీడీపీ కి స్థానం లేదని ఎద్దేవా చేశారు.తదనంతరం వై.యన్.ఆర్ ఛార్టిబుల్ ట్రస్ట్ ద్వారా జీవనోపాధి నిమిత్తం బాడవపేటకి చెందిన వంకపల్లి లక్ష్మి గారికి బడ్డి కొట్టు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి, వైసీపీ నాయకులు కుటుంబరావు, వడ్లమూడి సంపత్, సొంగా రాజ్ కమల్, తోకల శ్యామ్, కొండా, అశోక్, హరీష్, పరసా క్లైవ్, ఉదయ్, సుధీర్, నాగులు, ప్రేమలత, సలోమి, సౌమ్య, ఆనంద్, లేలిన్, దాస్ మరియు డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్స‌వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *