కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టిన పి. జయరావు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా (ఎఫ్‌ఏసీ) పి. జయరావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో డిఐపిఆర్ఓ బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు సకాలంలో, పారదర్శకంగా చేరేలా సమాచార పౌర సంబంధాల శాఖ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో ఆధునిక సమాచార సాధనాలను వినియోగించడంతో పాటు ప్రజలకు విశ్వసనీయమైన సమాచారాన్ని చేరవేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

జిల్లాలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయడంలో సమన్వయంతో పనిచేస్తూ శాఖ ప్రతిష్ఠను మరింత పెంపొందించేలా కృషి చేస్తానని పి. జయరావు ఈ సందర్భంగా తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *