కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎవ్వరూ ఆలోచించని రీతిలో జగనన్న అమలు చేస్తున్నారని పసివేదలకు చెందిన యలమాటి వెంకట నాగ జ్యోతి అలియాస్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలలో తమ జీవన విధానంలో ఆర్ధికంగా ఎంతో మార్పు వచ్చిందన్నారు. తన భర్త 6 నెలలు క్రితం దురదృష్టవశాత్తు మరణించినా డ్వాక్రా రుణాలు, వితంతు పింఛను, ఆసరా చేయూత తో అన్ని విధాలుగా అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. జగనన్న గత రెండు సంవత్సరాలు కాలంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా అండగా నిలిచారని పేర్కొన్నారు. స్త్రీ నిధి ద్వారా రూ.50 వేలు రావడంతో మా గ్రామంలో నే బట్టల దుకాణం ఏర్పాటు చేసుకుని, ఆర్ధికంగా కుటుంబానికి అండగా నిలవగలిగానని యలమాటి వెంకట నాగ జ్యోతి అలియాస్ వెంకట లక్ష్మి తెలిపారు. గతంలో టైలరింగ్ చేసే తనకు స్త్రీ నిధి, ఆసరా నగదు అందటం తో బట్టల వ్యాపారం ప్రారంభించానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వురు మండలం, పశివేదల గ్రామము ,పసివేదల ఆదర్శ గ్రామ సంఘము ,స్వాతి స్వయం సహాయక సంఘ సభ్యురాలు అయిన శ్రీమతి యలమాటి వెంకట నాగ జ్యోతి (వెంకట లక్ష్మి) భర్త సోమ శేఖర రావు అను వారు 2007 సం” ము నుండి సంఘ సభ్యురాలుగా ఉండి పొదుపు చేసుకొంటు బ్యాంకు రుణ సహకారముతో ఆమె గతము లో నేర్చుకొన్న టైలరింగ్ విద్యతో టైలరింగ్ షాపును ఏర్పాటు చేసు కొనియున్నారు. తదుపరి వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తదుపరి 2019-2020 సం .రం లో సంఘము వారి సహకారముతో స్త్రినిధి జీవనోపాధి ఋణమును రు.50000/- లను టైలరింగ్ లతో పాటు బట్టల వ్యాపారం చేసుకునే వేసులుపాటు వొచ్చిందని స్వాతి స్వయం సహాయక సంఘ సభ్యురాలు అయిన శ్రీమతి యలమాటి వెంకట నాగ జ్యోతి (వెంకట లక్ష్మి) తెలిపారు. ఆ మొత్తం తో చీరలు, ఫాల్స్ , లైనింగ్స, దారములు, టైలోరింగ్ ఫాన్సీ సామాన్లు అమ్మటం జరుగుతొందని తెలిపారు. తన భర్త సాధారణ రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వారని తెలిపారు. టైలరింగ్ తో బట్టలు, ఫ్యాన్సీ సామాన్లును స్టాక్ పెంపొందించు కొనుటవలన నెలకు సుమారుగా రు.10000/-ల వరకు ఆదాయమును పొందు చున్నామని నాగ జ్యోతి పేర్కొన్నారు.తన సంపాదన భర్త వ్యవసాయం అదాయమునకు చేదోడు వాదోడుగా ఉండ గలుగుతున్నానని , సమయంలో తన భర్త ఆరు నెలలు క్రితం దురదృష్టవశాత్తు మరణించి మమ్మల్ని శోక సంద్రంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వం ఒక మేనమామ లా అండగా ఉంటూ, అర్హత ఉన్న లబ్ది దారులకు కుల, మత, పార్టీ లతో సంబంధం లేకుండా పథకాలు అమలు చేయడం తో కృతజ్ఞతలు తెలియచేశారు. . జగనన్న ప్రభుత్వం చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నానని, ధన్యవాదాలు తెలిపారు.
Tags kovvuru
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …