డెంగ్యూ అవగాహన ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు -1 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం పరిధిలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. డెంగ్యూ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం,హెల్త్ అసిస్టెంట్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించి, డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సబ్ యూనిట్ ఆఫీసర్ B G అప్పారావు గారు ప్రజలకు వివరించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, నీటి నిల్వ పాత్రలను మూతపెట్టడం, ప్రతి వారం “డ్రై డే” పాటించడం, దోమల పెరుగుదలను నివారించడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం మరియు జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. డెంగ్యూ నివారణకు పరిసరాల పరిశుభ్రత మరియు ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని CHO మాలతి గారు తెలియజేశారు.
నినాదాలు:
– పరిసరాల పరిశుభ్రత – డెంగ్యూకు శాశ్వత నివారణ.
– నీరు నిల్వ ఉండనివ్వొద్దు – దోమలకు అవకాశం ఇవ్వొద్దు.
– డెంగ్యూను అరికట్టుదాం – ఆరోగ్యవంతమైన గ్రామాన్ని నిర్మిద్దాం.
– ప్రతి శుక్రవారం డ్రై డే పాటిద్దాం – డెంగ్యూకు చెక్ పెట్టుదాం.
– మన ఆరోగ్యం – మన బాధ్యత.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *