Breaking News

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు

-ముఖ్య అతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రలడ్హా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ చంద్ర లడ్హా, ఐజీ పీహెచ్ డీ రామకృష్ణ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ ఏ.జగదీష్, ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షిక పోటీల్లో 25 క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా టగ్ ఆఫ్ వార్ పోటీలను ప్రారంభించారు. క్రీడల పోటీల్లో ఆరు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచిన ఎస్. కమలేంద్రరావు ఈ ఏడాది వార్షిక క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచారు. క్రీడలు శారీరక ధృడత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని, టీమ్ స్పిరిట్ ను పెంపొందిస్తాయని ఇంటెలిజెన్స్ చీఫ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రీడాపోటీలను నిర్వహించేందుకు సహకరించిన ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం అధికారులు, శాప్ చైర్మన్ రవినాయుడు, ఇతర అధికారులకు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ధన్యవాదాలు తెలియచేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *