భూసమీకరణ కింద 32.25 ఎకరాల భూమిని అందజేసిన రాజధాని అమరావతి రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి కట్టా బ్రహ్మవర్ధనరావు కుటుంబసభ్యులు, రైతులు బడేటి ధర్మారావు, ఉన్నం నరహరి ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో తమ ఆధీనంలో ఉన్న 25.15 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం కట్టా బ్రహ్మవర్ధనరావు కుటుంబసభ్యులు, అలాగే లింగాయపాలెంకు చెందిన బడేటి ధర్మారావు 6.30 ఎకరాలు, మందడంకు చెందిన 0.80 ఎకరాల భూమిని ఉన్నం నరహరి .. APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత అంగీకార పత్రాలను కాంపిటెంట్ అథారిటీ అయిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శేషిరెడ్డి కి APCRDA అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్ సమక్షంలో రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం అందజేశారు. అనంతరం కాంపిటెంట్ అధికారులతో భూసమీకరణ ప్రక్రియలో భాగంగా 9.14 అగ్రిమెంట్‌ను రైతులు కుదుర్చుకున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని కట్టా బ్రహ్మవర్ధనరావు కుటుంబసభ్యులు, రైతులు బడేటి ధర్మారావు, ఉన్నం నరహరి ఈ సందర్భంగా తెలియజేశారు. రాజధాని గ్రామాల ప్రజలు పూలింగ్ ప్రక్రియకు APCRDA అధికారులతో సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *