-పాత రాజరాజేశ్వరి పేట లో రైల్వే అధికారుల నోటీసులపై నిరసన దీక్ష చేస్తున్న స్థానిక నివసితులకు ఎంపీ చిన్ని భరోసా
-నేరుగా దీక్ష శిబిరం వద్దకు వెళ్లి సమస్య తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ
-ఎంపీ చిన్ని హామీతో నిరసన దీక్ష విరమించుకున్న స్థానిక నివాసితులు
-రైల్వే, వి ఎమ్ సి అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తారని భరోసా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లోని పాత రాజరాజేశ్వరి పేటలో రైల్వే స్థలంలో నివాసం ఉంటున్నస్థానిక నివాసితులు నిరసన చేస్తున్న దీక్షా శిబిరం వద్దకు ఎంపీ కేసినేని చిన్ని నేరుగా వెళ్లి వారి సమస్యను తెలుసుకొని భరోసాని ఇచ్చారు
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పాత రాజరాజేశ్వరి పేట ప్రాంతం 56 వ డివిజన్ లో గత 50 ఏళ్ల నుండి రైల్వే స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు ఇది నిజంగా రైల్వే స్థలమైనప్పటికీ సొంత నిధులతో నిర్మించుకోవడం వల్ల దిగు మధ్యతరగతి కుటుంబాలన్నీ ఈ ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉంటారు అని ఎంపీ అన్నారు ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడం స్థానికంగా ఉండే నివాసితులు ఇబ్బందులు ఎదుర్కోవడం గడచిన సంవత్సరంలో కూడా ఇలా నోటీసులు ఇస్తే రైల్వే అధికారుల దృష్టికి వారి సమస్యను తీసుకువెళ్లి తాత్కాలికంగా నివారించామని అన్నారు మరోసారి రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడంతో నిరసన చేస్తున్న దీక్ష శిబిరం దగ్గరకు నేరుగా వచ్చి వారితో ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగిందని తెలియజేశారు ప్రతి సంవత్సరం రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయ నాయకులు వచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగించడమే జరుగుతుందని ఈసారి శాశ్వత పరిష్కారం చూపించమని స్థానిక నివాసితులు ఎంపీ చిన్నిని కోరారు
దీంతో స్పందించిన ఎంపీ చిన్ని తక్షణం ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి తో కలిసి రైల్వే డిఆర్ఎం మరియు అధికారులు వియంసి అధికారులు తో మాట్లాడి మొట్టమొదటిగా ఈ అంశంపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఉండాలని అధికారులను కలిసి తెలియజేస్తారని వారికి భరోసానిచ్చారు అధికారులతో మాట్లాడిన అనంతరం అధికారులు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం కచ్చితంగా తీసుకువస్తారని స్థానిక నివాసితులకు ఎంపీ చిన్ని హామీ ఇచ్చారు గతంలో వరదల సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఈ ప్రాంత పరిస్థితులు అవగాహన ఉంది కాబట్టి ఈ సమస్యను కూడా తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఎంపీ తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఇళ్లు నిర్మాణం చేసే ప్రభుత్వమే కానీ కూల్చివేసే ప్రభుత్వం కాదని ఇది ప్రతి ఒకరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమని ఎంపీ అన్నారు
ఈ కార్యక్రమంలో ఉమ్మడికృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి షైక్ ఆషా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా,శాప్ డైరెక్టర్ సంతోష్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ,వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు సోలంకి రాజు, టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్ మాధవ,56 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పెద్ది శ్యాంసుందర్, క్లస్టర్ ఇంచార్జ్ దనేకుల సుబ్బారావు, యూనిట్ ఇంచార్జ్ షేక్ బడేషా,రాజు ఎస్టి సెల్ నాయకులు, లక్కు శాంతి,శేషారావు, లక్ష్మి, తడసం శ్రీనివాస్, నాయకులు భూదాల నందకుమారి, టిఎన్టియుసి నియోజకవర్గ అధ్యక్షుడు మక్కెన భాస్కర్, జహీద్, కొప్పుల గంగాధర్ రెడ్డి, నమ్మి భాను వడ్డాది రమణ, జోగేష్,అజీజ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు, పైడిమాల సుభాషిని, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మైనంపల్లి రాజు, టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు మోడీ రాజు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News